

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి స్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనంపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆయన అధికారాలను పరోక్షంగా పరిమితం చేసే చర్యలకు మమత శ్రీకారం చుట్టారు. డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్‌లను జాతీయ సంయుక్త కార్యదర్శులుగా నియమించడం ద్వారా పార్టీ వ్యవహారాల్లో సమిష్టి నాయకత్వానికి ప్రాధాన్యం కల్పించారు.
అదే సమయంలో సీనియర్ నేత చంద్రిమ భట్టాచార్యను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. ఈ మార్పులు పార్టీలో ఐక్యతను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలుగా భావిస్తున్నారు. మరోవైపు బహరంపూర్ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ రాజీనామా చేయాలని తాను సూచించానంటూ వచ్చిన వార్తలను మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!