
జనరల్

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక నలుగురు అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయని అధికారులు ప్రకటించారు.
టీడీపీ తరఫున భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ దాఖలు చేసిన నామినేషన్లు ఆమోదం పొందగా, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ నామినేషన్‌కు కూడా ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో తదుపరి దశలకు మార్గం సుగమమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!