
జనరల్

నల్లసముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవీ ఓమోర్ఫి అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు భారతీయులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులు సేకరిస్తున్నారు.
వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడం అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సముద్ర రవాణా భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నావికుల ప్రాణాల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!