
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో ఈ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రణాళికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మరోవైపు, బడ్జెట్ సమావేశాల సమయంలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అంశంపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాలతో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు, చర్చలు కీలకంగా మారనున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!