

తమిళనాడు అసెంబ్లీలో తాగునీటి సరఫరా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో భాజపా సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీలో తాగునీరు అందించే అంశంపై జరిగిన చర్చలో మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. గాజు సీసాలు వాడితే సభ్యులు ఆవేశంలో విసిరే అవకాశం ఉందని ఆయన చమత్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.
తాను తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజ్‌భవన్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చి, అతిథులకు గాజు సీసాల్లో నీరు అందించే విధానాన్ని అమలు చేశానని తమిళిసై తెలిపారు. అదే విధానాన్ని తమిళనాడు అసెంబ్లీలో కూడా అమలు చేయవచ్చని సూచించారు. చిన్న గాజు సీసాలు ఉపయోగించినా పెద్దగా హాని జరగదని పేర్కొంటూ, పర్యావరణహిత చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!