

ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేటి నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో వరుసగా వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రతి డీసీసీ అధ్యక్షుడి పనితీరు, పార్టీ బలోపేతం కోసం చేపట్టిన కార్యక్రమాలు, జిల్లా స్థాయి రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ సమావేశాలకు ప్రోగ్రెస్ కార్డుతో హాజరుకావాలని డీసీసీ అధ్యక్షులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నెల 17న రాష్ట్ర మంత్రులతో కూడా మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. మంత్రులతో విడివిడిగా భేటీ అయి ప్రభుత్వ పనితీరు, పార్టీ-ప్రభుత్వ సమన్వయం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలపై చర్చించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాలు కాంగ్రెస్ సంస్థాగత బలోపేతానికి కీలకంగా మారనున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!