

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించిన ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నిరసనలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నల్లరంగు పూసి ఆందోళన చేపట్టిన నాయకులు, బీజేపీ జెండా మరియు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని నిరసనను అడ్డుకున్నారు. అనంతరం జక్కిడి శివ చరణ్ రెడ్డితో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!