

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సైబర్ నేరాల ముప్పు పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించి అనుమానాస్పద, అశ్లీల యాప్‌లను ప్రచారం చేస్తూ యూజర్లను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించే పేరుతో ఫోన్లలోకి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను చొప్పించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
చోరీ చేసిన డేటాను ఉపయోగించి ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తమ ఆన్‌లైన్ ట్రాఫిక్‌ను VPNల ద్వారా మళ్లిస్తూ కార్యకలాపాలను గుర్తించడం కష్టతరం చేస్తున్నట్లు తెలిపారు. అందువల్ల అపరిచిత వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు లేదా తెలియని వనరుల నుంచి APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే ముందు వాటి అనుమతులను పరిశీలించి, నమ్మకమైన యాప్ స్టోర్లను మాత్రమే ఉపయోగించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!