
జనరల్

త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ సీనియర్ నాయకులు డీకే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం నిజమైతే తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న బీజేపీ వ్యూహంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటల రాజేందర్‌కు ఉన్న పరిపాలనా అనుభవం, బీసీ వర్గాల్లో ఉన్న ఆదరణ, అలాగే డీకే అరుణకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఉన్న అనుభవం ఈ ఎంపికలో కీలకంగా మారవచ్చని చర్చ జరుగుతోంది. అయితే ఈ నియామకాలపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!