10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

Writer: Shivani K 12:31 PM, 10 ఆగస్టు, 2026
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, నృసింహసాగర్ రిజర్వాయర్లను నింపాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వానాకాలంలో తక్కువ వర్షపాతం, రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున, మిడ్ మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసి అనుసంధాన రిజర్వాయర్లు, చెరువులు, చెక్‌డ్యామ్‌లను నింపాలని కోరారు. అలాగే 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు డ్యామ్‌లో ప్రస్తుతం 6.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, మిడ్ మానేరు నుంచి నీటిని తరలించి ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల పోటాపొటీ కార్యక్రమాలు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల పోటాపొటీ కార్యక్రమాలు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

మమతా బెనర్జీకి నిరసన సెగ..

మమతా బెనర్జీకి నిరసన సెగ..

ట్యాగ్లు
హరీశ్‌రావుకాళేశ్వరం ప్రాజెక్టుఉత్తమ్‌కుమార్‌రెడ్డితెలంగాణ నీటిపారుదలకాళేశ్వరం మోటార్లుమిడ్ మానేరు రిజర్వాయర్లోయర్ మానేరు డ్యామ్తెలంగాణ రైతులుసాగునీరుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..
సినిమాలు

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!