
బిజినెస్

కరీంనగర్‌లో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌తో తమకు పోటీ లేదని, ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్‌లను సందర్శించడం జోక్‌లా ఉందని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లు ఏమైనా పర్యాటక కేంద్రాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎక్కడిదని నిలదీశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటు భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల తీరును ఆయన విమర్శించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!