

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పి. రాకేశ్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొంటూ, మంత్రుల జిల్లాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఆర్మూర్‌లో రెవెన్యూ కార్యాలయ నిర్మాణం కోసం చాలా కాలంగా కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
మరోవైపు, బీజేపీ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ దివ్యాంగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,016కు పెంచాలని, వారి కోటాలోని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. రంగారెడ్డి పరిధిలోని ఆర్థోపెడిక్ సదుపాయాలను హైదరాబాద్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని పాయల్ శంకర్ కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!