

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ ఆదివారం (ఈ నెల 06) సాయంత్రం షో ప్రారంభం కానుంది. ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో ఈసారి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో పాటు గేమ్స్, టాస్కుల్లోనూ పలు మార్పులు చేసినట్లు సమాచారం. ఆడియెన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేలా నిర్వాహకులు భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ ఎవరనే విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, సీజన్ 3లో పాల్గొన్న యాంకర్ శ్రీముఖి ఈ రికార్డు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండగా, రోజుకు రూ.80 వేల చొప్పున మొత్తం రూ.80 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆ సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.20 లక్షల రెమ్యునరేషన్‌తో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ కలిపి మొత్తం రూ.70 లక్షలు దక్కినట్లు తెలుస్తోంది. దీంతో విజేత కంటే శ్రీముఖికే ఎక్కువ పారితోషికం లభించినట్లు ప్రచారం జరుగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!