

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ 10వ సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈసారి సామాన్యులను కూడా హౌస్‌లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘అగ్నిపరీక్ష’ పేరుతో ప్రత్యేక ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వందలాది మంది నుంచి 15 మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేసి, వారిలో ఐదారు మందికి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించనున్నారు.
‘అగ్నిపరీక్ష’లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు జడ్జీలుగా వ్యవహరించనున్నారు. వారి టాస్క్‌లను పూర్తి చేసి మెప్పించిన వారికి హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కనుంది. ఈరోజు నుంచి ఈ ఎపిసోడ్‌లు స్టార్ మా, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. ఈ ఆడిషన్స్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో ఉప్పల్ బాలు కూడా ఉండటంతో ఆయనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ‘అగ్నిపరీక్ష’ ఎంపిక విధానంపై ఉప్పల్ బాలు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!