

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దానికి ముందే ‘అగ్నిపరీక్ష’ షో హీట్ పెంచుతోంది. రెండో సీజన్ ‘అగ్నిపరీక్ష’ ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. వేలాది దరఖాస్తుల నుంచి దాదాపు 70 మందిని షార్ట్‌లిస్ట్ చేసి, టాస్కులు, ఇంటర్వ్యూలు, ఛాలెంజ్‌ల ద్వారా చివరకు 15 మందిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఆ తర్వాత ఎంపికైన వారిలో ఐదుగురు లేదా ఆరుగురికి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా ప్రోమో ఈ ఉత్కంఠను మరింత పెంచింది. అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా కనిపిస్తుండగా, శ్రీముఖి తన ఎనర్జిటిక్ కామెంట్స్‌తో షోకు మరింత జోష్ తీసుకొచ్చారు. సరదా సంభాషణలతో పాటు, తప్పులు చేసిన కంటెస్టెంట్లకు జడ్జీలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది.
ఓ కంటెస్టెంట్ రూల్స్‌ను ఉల్లంఘించినట్లు కనిపించడంతో శ్రీముఖి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరో కంటెస్టెంట్ అభిజీత్‌ను టార్గెట్ చేస్తూ బిగ్ బాస్ తర్వాత కొంతకాలం కనిపించలేదని వ్యాఖ్యానించడంతో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు ‘రైతు బిడ్డ’ కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం లభించినట్లు సమాచారం. రివర్స్ రైటింగ్ వంటి ప్రత్యేక ప్రతిభతో వచ్చిన మరో కంటెస్టెంట్ కూడా తదుపరి దశకు ఎంపికైనట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!