
జనరల్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఆటతోనే కాకుండా తన సరదా చేష్టలతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. ఓవర్ల మధ్య విరామంలో తోటి ఆటగాళ్లతో సరదాగా వ్యవహరిస్తూ సందడి చేస్తుంటాడు. తాజాగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలోనూ ఇలాంటి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవర్ల మధ్యలో కోహ్లీ తనదైన శైలిలో సందడి చేశాడు.
న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ పక్క నుంచి వెళ్తున్న సమయంలో కోహ్లీ ‘యూ కాంట్ సీ మీ’ అంటూ చేతితో ప్రత్యేకమైన సంజ్ఞ చేశాడు. ఈ సెలబ్రేషన్ WWE దిగ్గజం జాన్ సీనా ట్రేడ్‌మార్క్ మూవ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కోహ్లీ చేసిన ఈ సరదా చేష్ట కెమెరాకు చిక్కడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్, WWE అభిమానులు ఈ వీడియోను ఆసక్తిగా పంచుకుంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!