

హైదరాబాద్‌లో ప్రారంభమైన టీజీ20 టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ఆమోదం ఉందని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు వి. చాముండేశ్వరనాథ్ స్పష్టం చేశారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, టీజీ20 నిర్వహణపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని పేర్కొన్నారు. ఆటగాళ్లు, స్పాన్సర్లు, భాగస్వామ్య సంస్థలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
టీజీ20 పూర్తిగా బీసీసీఐ ఆమోదంతో నిర్వహించబడుతున్న అధికారిక టోర్నమెంట్ అని ఆయన వెల్లడించారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని అనుమతులు, మార్గదర్శకాలు పాటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లు కీలకమని పేర్కొన్న ఆయన, యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు టీజీ20 ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!