

పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడుగురు మాజీ కెప్టెన్లు కలిసి ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి సెనేటర్ పెన్నీ వాంగ్‌కు సంయుక్తంగా లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్ నిర్బంధానికి సంబంధించిన మానవతా ఆందోళనలను పాకిస్థాన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ అంశంపై తాము మౌనం వహించలేక లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ లేఖపై అలాన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూస్, మార్క్ టేలర్, స్టీవ్ వా సంతకాలు చేశారు. తాము దౌత్యవేత్తలుగా లేదా రాజకీయ నాయకులుగా కాకుండా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన మాజీ కెప్టెన్లుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నామని వారు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంపై మానవతా దృష్టితో స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!