

నాలుగో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సీజన్‌లో భాగంగా టీమ్‌ఇండియా శ్రీలంకతో కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ ముగ్గురి నైపుణ్యాలు భిన్నంగా ఉన్నాయని బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ పేర్కొన్నాడు.
పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్‌కు జోడీగా ఎవరిని ఆడించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మోర్కెల్ తెలిపాడు. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తదితరులు పోటీలో ఉన్నారు. 25-30 ఓవర్ల తర్వాత బంతి సాఫ్ట్‌గా మారే అవకాశం ఉండటంతో బౌలింగ్ వ్యూహం కీలకం కానుంది. మరోవైపు గాయం కారణంగా సాయి సుదర్శన్ సిరీస్‌కు దూరమవడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!