

భారత హాకీ జట్ల జెర్సీల్లో మరోసారి మార్పు చోటుచేసుకుంది. రాబోయే ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు సంప్రదాయ నీలి రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నాయి. ఇటీవల ప్రపంచకప్‌లో భారత జట్లు కాషాయ రంగు కిట్లతో ఆడటంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. జెర్సీ కిట్‌కు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వివరాలు అడిగిందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తెలిపారు. నీలం భారత ప్రధాన రంగమని, కాషాయం రెండో ప్రత్యామ్నాయ రంగమని స్పష్టం చేశామని చెప్పారు. ప్రపంచకప్ కోసం జెర్సీ రంగులో చేసిన మార్పు తాత్కాలికమేనని ముందుగానే చెప్పినట్లు వెల్లడించారు.
ఈ నెల 19న ప్రారంభం కానున్న ఆసియా క్రీడలు 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే విషయంలో భారత హాకీ జట్లకు అత్యంత కీలకంగా మారాయి. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధిస్తే పురుషుల, మహిళల భారత జట్లు నేరుగా ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకోనున్నాయి. దీంతో ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టోర్నీని సోనీ స్పోర్ట్స్‌లో వీక్షించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!