

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఒక్క పరుగూ ఇవ్వకుండా ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి స్పెల్‌లో ఆరు ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చినా వికెట్ దక్కని గ్రీవ్స్, రెండో స్పెల్‌లో అద్భుతంగా పుంజుకుని వరుసగా ఐదు మెయిడెన్ ఓవర్లు వేస్తూ ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ పడగొట్టాడు. టెస్టు చరిత్రలో ఐదు వికెట్లు తీసే క్రమంలో ఒక్క పరుగూ ఇవ్వకుండా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
మూడో రోజు ఆట ప్రారంభానికి 3 వికెట్ల నష్టానికి 244 పరుగులతో బలంగా కనిపించిన పాకిస్తాన్‌ను గ్రీవ్స్ తన అద్భుత బౌలింగ్‌తో కుదేలు చేశాడు. షాన్ మసూద్, మహ్మద్ రిజ్వాన్, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహ్మద్ అబ్బాస్‌లను ఔట్ చేసి పాకిస్తాన్‌ను 282 పరుగులకు ఆలౌట్ చేశాడు. 244/3 నుంచి చివరి ఏడు వికెట్లను కేవలం 38 పరుగుల వ్యవధిలో కోల్పోయిన పాకిస్తాన్ భారీ పతనాన్ని చవిచూసింది. టెస్టుల్లో గ్రీవ్స్‌కు ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కాగా, మూడో రోజు ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 126 పరుగులు చేసి 155 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!