
క్రీడలు

భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ర్యాపిడ్ విభాగంలో మొత్తం తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీలో తన స్థిరమైన ఆటతీరుతో ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటుతూ టైటిల్ రేసులో ముందంజలో నిలిచాడు.
అయితే తొమ్మిదో రౌండ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన జోర్డన్ వాన్ ఫోరీస్ట్ చేతిలో ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యాడు. అయినప్పటికీ మొత్తం పాయింట్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక మిగిలిన 18 రౌండ్ల బ్లిట్జ్ పోటీలు ముగిసిన అనంతరం టోర్నీ విజేతను ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!