

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటుచేసుకున్న సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వైభవ్ భారీ షాట్లతో దూకుడుగా ఆడుతుండటంతో అతడిని నిలువరించేందుకు తిలక్ వర్మ సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో వైభవ్ దగ్గరకు వెళ్లిన తిలక్.. ‘వైస్ కెప్టెన్.. ఏంటిది?’ అంటూ సరదాగా అన్నట్లు కనిపించింది. అనంతరం ఇద్దరూ నవ్వుకోవడంతో ఇది సరదా సంభాషణేనని స్పష్టమైంది.
అయితే ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే వైభవ్ సూర్యవంశీ 44 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 37 బంతులు ఎదుర్కొన్న వైభవ్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ 72 పరుగులతో ఆకట్టుకున్నాడు. సుదీప్ కుమార్ ఆరు పరుగులు చేశాడు. ఈస్ట్ జోన్ మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ప్రస్తుతం శిఖర్ 34 పరుగులతో, ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే క్రీజులో ఉన్నారు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురన, వి. మిలింద్ చెరో వికెట్ తీశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!