

భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కేవలం నాలుగు పదాలతో పాకిస్థాన్‌పై సెటైర్ వేశాడు. ఆసియాకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం తర్వాత ఇర్ఫాన్ చేసిన ‘ఆజ్ సండే హై క్యా?’ (ఇవాళ ఆదివారమా ఏంటి?) అనే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పాకిస్థాన్‌ను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేయగా.. భారత్ 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఘన విజయాన్ని వెక్కిరిస్తూ ఇర్ఫాన్ తనదైన శైలిలో పాక్‌ను ట్రోల్ చేశాడు.
ఇర్ఫాన్ తాజా ట్వీట్‌కు అతడి గతంలోని ‘సండే’ ట్రోలింగ్ కూడా కారణంగా నిలిచింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్‌పై భారత్ గెలిచిన తర్వాత ‘పడోసియో.. సండే కైసా రహా?’ అంటూ ఇర్ఫాన్ చేసిన ట్వీట్ అప్పట్లో వైరల్ అయింది. 2024 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌పై భారత్ ఛాంపియన్స్ విజయం సాధించిన సమయంలోనూ అర్ధరాత్రి దాటడంతో ‘సండే’ ట్రోలింగ్ సాగింది. గత ఆసియాకప్‌లో భారత్-పాక్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లూ ఆదివారాలే కావడం, మూడింటిలోనూ భారత్ గెలవడం ఈ సరదా ట్రోలింగ్‌కు మరింత బలం చేకూర్చింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇర్ఫాన్ తాజా పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారింది. ఇటీవల వసీం అక్రమ్ కూడా సరదాగా స్పందిస్తూ.. తాను నేర్పిన బౌలింగ్ ట్రిక్కులతో ఇర్ఫాన్ ఇప్పుడు తమ దేశాన్నే వెక్కిరిస్తున్నాడని వ్యాఖ్యానించాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!