
జనరల్

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు పతకం సాధించగలదని గోల్‌కీపర్ సవిత పునియా ధీమా వ్యక్తం చేసింది. ఇటీవల నేషన్స్ కప్‌ను గెలవడం జట్టుకు భారీగా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆమె పేర్కొంది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీపడే నైపుణ్యం, ఫిట్నెస్, మానసిక బలం తమ జట్టుకు ఉన్నాయని తెలిపింది.
తనకు ఇది వరుసగా మూడో ప్రపంచకప్ అని, భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని సవిత చెప్పింది. అవసరమైన సందర్భాల్లో తన అనుభవంతో సహచరులకు సూచనలు ఇస్తానని, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ జట్టు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానని తెలిపింది. కెప్టెన్ సలీమా టెటెను ప్రశంసిస్తూ ఆమె గొప్ప నాయకురాలు, అద్భుతమైన ప్లేయర్ అని పేర్కొంది. 2026 మహిళల హాకీ ప్రపంచకప్‌కు బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!