

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం ముగింపు దశకు చేరుకుంది. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో హౌస్‌లో సందడి నెలకొంది. ఈ వారం తాను చాలా ఎంజాయ్ చేశానని చెప్పిన నాగార్జున.. కృష్ణుడు, సృష్టి హౌస్‌లో ఉన్నట్లు అనిపించలేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చూపించి, ఇద్దరినీ స్టోర్ రూమ్‌కు పంపించారు. మరోవైపు సింగర్ ఝాన్సీని నాగార్జున ప్రశంసిస్తూ.. హౌస్‌లో తొలి మహిళా కెప్టెన్‌గా నిలిచావని, ఆటను వందశాతం ఎఫర్ట్‌తో ఆడుతున్నావని అభినందించారు. అనంతరం హౌస్‌మేట్స్ తమ జీవితాల్లోని సీక్రెట్ విషయాలను పంచుకోవాలని కోరగా.. రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ తమ అనుభవాలను వెల్లడించారు.
ఆ తర్వాత హౌస్‌లో మానిపులేటర్, పప్పెట్స్ ఎవరు అనే అంశంపై నాగార్జున హౌస్‌మేట్స్‌తో చర్చించారు. సుధీర్‌ను వర్షిణి మానిపులేట్ చేస్తోందని చరణ్ చెప్పగా, గేమ్ రూల్స్ చదవకుండా ఆడినందుకు చరణ్‌ను నాగ్ మందలించారు. వంశీని త్రిగుణ్ కంట్రోల్ చేస్తున్నారని రామ్ ప్రసాద్ చెప్పగా.. ఆడియన్స్ పోల్‌లోనూ వంశీ త్రిగుణ్ చేతిలో పప్పెట్‌గా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. రోహిత్ కూడా వంశీ, త్రిగుణ్ పేర్లనే ఎంచుకున్నాడు. సంచాలకుడిగా రామ్ ప్రసాద్ ఫెయిల్ అయ్యాడని నాగార్జున చెప్పగా, ఆయన తన తప్పును అంగీకరించారు. అలాగే చరణ్‌ను రోహిత్ మానిపులేట్ చేస్తున్నాడని వర్షిణి చెప్పగా, ఆడియన్స్ పోల్‌లోనూ అదే అభిప్రాయం వ్యక్తమైంది. సంచాలకురాలిగా వర్షిణి నిర్ణయం సరైనది కాదని పేర్కొన్న నాగ్.. ఈ వారం ఆమె సంచాలకురాలిగా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. షాలిని-వర్షిణి మధ్య జరిగిన గొడవలో షాలినిదే తప్పని నాగార్జున తేల్చారు. చివరగా ముకేశ్, దేబ్జానీ, ఝాన్సీ, షాలిని సేఫ్ కాగా.. త్రిగుణ్, కృష్ణుడు, సృష్టి, సుధీర్, వర్షిణి, రోహిత్ అన్‌సేఫ్‌గా మిగిలారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!