

ఏఐ కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయనే భయాలు అవసరం లేదని, పోయే ఉద్యోగాల కంటే ఎక్కువ కొత్త అవకాశాలు సృష్టించబడతాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ, అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన తాజా బ్లాగ్‌లో భారతీయ ఇంజినీర్లకు కీలక సూచనలు చేశారు. ఏఐని భయపడకుండా, దానితో కలిసి పనిచేసే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతికత వేగంగా మారుతున్న నేపథ్యంలో ఉద్యోగులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం అత్యవసరమని అన్నారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025’ నివేదికను ప్రస్తావిస్తూ, 2030 నాటికి 39 శాతం ప్రధాన ఉద్యోగ నైపుణ్యాలు మారిపోతాయని, భారతదేశంలో 63 శాతం మంది ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్ లేదా అప్-స్కిల్లింగ్ అవసరమవుతుందని తెలిపారు. 1995 ఇంటర్నెట్ విప్లవం మాదిరిగానే ఏఐ కూడా ప్రారంభంలో ఆందోళనలు కలిగించినా, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐ ట్రైనర్లు, ఏజెంట్ స్పెషలిస్టులు, ఏఐ సెక్యూరిటీ నిపుణులు వంటి కొత్త ఉద్యోగ విభాగాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. కోడింగ్‌లో ఏఐ సహాయపడగలదే గానీ, మానవ నిర్ణయాలు, సృజనాత్మకత, నైతిక విలువలు, అనుభవాన్ని భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం హైదరాబాద్‌లోనే ఉందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!