
జనరల్

పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొత్త సుంకాలను ప్రకటించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.4, డీజిల్‌పై రూ.8.5, ATFపై రూ.7.5 చొప్పున ఎగుమతి సుంకం విధించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త రేట్లు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు మారిషస్, మాల్దీవులకు ఎగుమతులపై సుంక మినహాయింపు ఇచ్చింది. దేశీయ వినియోగానికి సంబంధించిన ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!