

‘విశ్వనాథ్ & సన్స్’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఓ ఇంటర్వ్యూలో ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం గురించి స్పందించారు. చిరంజీవి కోసం తన దగ్గర ఓ కథాంశం ఉందని, అయితే అలాంటి భారీ స్థాయి చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడిగా తనకు మరింత అనుభవం, పరిణితి అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచే చిరంజీవికి తాను వీరాభిమానినని వెంకీ పేర్కొన్నారు.
చిరంజీవి కోసం అనుకున్న కథ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని వెంకీ అట్లూరి వెల్లడించారు. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ‘విశ్వనాథ్ & సన్స్’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. వెంకీ తన కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేసిన తర్వాతే చిరంజీవితో ప్రాజెక్ట్‌పై ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!