
జనరల్

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన సరికొత్త గ్లోబల్ మిడ్‌సైజ్ పికప్ ట్రక్ ‘స్కార్పియో లైఫ్‌స్టైలర్’ను ఆవిష్కరించింది. ఈ వాహనాన్ని 2027 ఏప్రిల్ నాటికి భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.19.79 లక్షల (ఎక్స్‌షోరూమ్) కంటే తక్కువగా ఉండనున్నట్లు మహీంద్రా వెల్లడించింది.
కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ను వ్యాలీ, రీఫ్, ట్రయల్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ పికప్ ట్రక్, లైఫ్‌స్టైల్ డిజైన్‌తో పాటు ప్రయోజనాత్మకతను కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ మోడల్ రాకతో మిడ్‌సైజ్ పికప్ విభాగంలో పోటీ మరింత పెరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!