

దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వ్యాగన్ ఆర్‌ను మారుతి సుజుకీ విడుదల చేసింది. దీనికి ఒక రోజు ముందే హీరో మోటోకార్ప్ సంస్థ స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అనే రెండు బైకులను విడుదల చేయడం గమనార్హం. దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల విస్తరణ వేగంగా జరుగుతోంది.
ఈ వ్యాగన్ ఆర్ కారు ఈ20 నుంచి ఈ100 వరకు వివిధ మిశ్రమ ఇంధనాలతో నడుస్తుంది. ఈ వాహనాలు దేశ ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. చమురు దిగుమతులు తగ్గించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయని, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఇథనాల్ ఫ్యూయల్ స్టేషన్లను దశలవారీగా పెంచేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశలో ఢిల్లీ ఎన్సీఆర్‌తో పాటు పుణె, ముంబై, నాగపూర్ నగరాల్లో 50 నుంచి 100 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తర్వాత ఏడాదిలో వీటిని 500కు, 2027 నాటికి 5,000కు విస్తరించనున్నారు. ఇప్పటికే ఈ20 వినియోగం సాధించిన భారత్ ఇప్పుడు ఈ22, ఈ25, ఈ30, ఈ85, ఈ100 దిశగా ముందుకు సాగుతోంది. అయితే ధరలు, మైలేజ్‌పై ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!