
సినిమాలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశాలపై ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం జూన్ 12న ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు సుమారు రూ.12 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇంధన ధరలను సవరించే అంశాన్ని చమురు సంస్థలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ధరల పెంపుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!