

ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. క్రెడిట్ కార్డు మోసాలకు గురైన వినియోగదారులకు ఫిర్యాదు చేసిన ఐదు రోజుల్లోనే తాత్కాలికంగా నగదు జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది.
రూ.500కు మించిన ప్రతి లావాదేవీపై వినియోగదారులకు వెంటనే సందేశం పంపడం తప్పనిసరి చేసింది. రూ.500లోపు లావాదేవీలపై సందేశాలు పంపాలా వద్దా అనేది బ్యాంకుల నిర్ణయానికి వదిలివేసింది. అయితే వాటికి ఎలాంటి రుసుము వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
బ్యాంకుల నిర్లక్ష్యం లేదా వ్యవస్థ లోపాల వల్ల జరిగే మోసాలకు వినియోగదారులపై ఎలాంటి బాధ్యత ఉండదని ఆర్‌బీఐ తెలిపింది. మూడో పక్షం కారణంగా మోసం జరిగితే ఐదు రోజుల్లో ఫిర్యాదు చేస్తే వినియోగదారులకు బాధ్యత ఉండదు. ఈ నిబంధనలు యూపీఐ, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు కూడా వర్తిస్తాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!