

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా సజావుగా కొనసాగుతుందన్న ఆశావహ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతను తీసుకొచ్చాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి ₹94.53 వద్ద బలపడడం, క్రూడాయిల్ ధరలు తగ్గడం దేశీయ మార్కెట్లకు మద్దతు ఇచ్చాయి.
గత ముగింపు స్థాయి 76,808తో పోలిస్తే సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల లాభంతో ప్రారంభమై రోజంతా బలంగా కొనసాగింది. చివరికి 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనించి 96 పాయింట్ల లాభంతో 24,085 వద్ద స్థిరపడింది.
సెక్టోరల్‌గా ట్రెంట్, భారత్ డైనమిక్స్, వెర్నోవా టీడీ, యస్ బ్యాంక్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. టీఎమ్‌పీవీ, బీఎస్‌ఈ లిమిటెడ్, కోల్గేట్, లోథా డెవలపర్స్, సమ్మన్ క్యాపిటల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 187 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 321 పాయింట్లు లాభపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!