
జనరల్

భారత ప్రభుత్వం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ ఆదాయం, మూలధన లాభాలపై పన్ను మినహాయింపులు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. జూన్ 5 గెజిట్ ప్రకటన ప్రకారం ఈ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
ఫుల్లీ యాక్సెసబుల్ రూట్ పరిధిని విస్తరించి దీర్ఘకాలిక బాండ్లు, గ్రీన్ బాండ్లను చేర్చింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నారై డిపాజిట్లపై నిబంధనలు సడలించింది. ఈ నిర్ణయాలతో విదేశీ పెట్టుబడులు పెరిగి, దేశీయ రుణ మార్కెట్ బలోపేతం కావడంతో పాటు రూపాయి పతనం తగ్గే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!