
ఓటీటీ

విశాఖలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
బాధిత కుటుంబాల విజ్ఞప్తి మేరకు కోస్ట్‌గార్డ్ చేపడుతున్న గాలింపు చర్యలను రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు పొడిగించారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన అనంతరం గల్లంతైన వారి వివరాలపై అధికారిక సమాచారం అందజేయనున్నారు. అనంతరం మిస్సింగ్ కేసులకు సంబంధించిన త్రి-మెన్ కమిటీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!