
బిజినెస్

పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 ఏళ్ల బాలిక క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కొందరి ప్రభావానికి లోనై తప్పుగా మాట్లాడానని, తన మాటలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీతో పాటు దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. ఇకపై ఇలాంటి తప్పు మళ్లీ చేయనని హామీ ఇచ్చింది.
ఈ ఘటనపై నోయిడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, జీరో ఎఫ్‌ఐఆర్ ద్వారా ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మరోవైపు, యువత చేసిన తప్పిదాలను తాను క్షమిస్తున్నానని ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. బాలిక తల్లి కూడా జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇప్పటికే పోలీసులకు క్షమాపణ లేఖ అందజేసినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!