
జనరల్

2025 జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీజే వైద్య కళాశాల వసతి గృహ భవనంపై కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, నేలపై ఉన్న 19 మంది కూడా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 260కు చేరింది.
ఈ విషాద ఘటనకు దాదాపు ఏడాది పూర్తవుతున్నప్పటికీ బాధిత కుటుంబాలు ఇంకా ఆ మానసిక వేదన నుంచి బయటపడలేకపోతున్నాయి. కొందరు విమాన ప్రయాణం చేయాలంటే తీవ్ర భయాందోళనలకు గురవుతుండగా, మరికొందరు మానసిక ఒత్తిడి, ఆందోళనలను అధిగమించేందుకు నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆ భయానక దృశ్యాల జ్ఞాపకాలతో పోరాడుతూ సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!