
జనరల్

భారత సైన్యంలో యుద్ధ హెలికాప్టర్‌ను నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందిన మేజర్ అభిలాష బరాక్కు ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి సైనిక లింగ సమానత్వ ప్రోత్సాహకురాలు 2025 పురస్కారం లభించింది. లెబనాన్‌లో మహిళలు, బాలికల సంక్షేమం కోసం చేపట్టిన విశిష్ట సేవలకు గాను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
హరియాణాలోని రోహ్తక్కు చెందిన అభిలాష బరాక్ 2018 సెప్టెంబరులో సైన్య వాయు రక్షణ దళంలో చేరారు. ప్రస్తుతం లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి మధ్యంతర దళం ఆధ్వర్యంలోని భారత బెటాలియన్‌లో భాగస్వామ్య బృంద కమాండర్‌గా, లింగ సమానత్వ సమన్వయ అధికారిణిగా సేవలందిస్తున్నారు. మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ల తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న మూడో భారతీయ మహిళగా ఆమె నిలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!