
సినిమాలు

తెలంగాణ అడ్మిషన్లు మరియు ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు కీలక నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకన్నా అదనంగా ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపే విధంగా వ్యవహరించవద్దని కళాశాలల యాజమాన్యాలను హెచ్చరించింది.
ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు నిర్మాణాన్ని కచ్చితంగా పాటించాలని టీఏఎఫ్‌ఆర్‌సీ సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని కమిటీ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!