
సినిమాలు

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. ఆయనను గుర్తించి అరెస్ట్ చేసేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉదయ్‌కృష్ణారెడ్డి సెల్‌ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో గాలింపు ప్రక్రియ మరింత ముమ్మరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను ఇప్పటికే నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!