

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేపడుతోంది. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం ముందుగా సెప్టెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి, చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి అధికార యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వరుసగా 45 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవాలని ఆయన ఆదేశించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ కార్యక్రమాలను వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!