

విజయవాడ సాయికృష్ణ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా మే 24, 25 తేదీల్లో స్వర్గపురి స్మశానవాటికలో దహనం చేసిన గుర్తుతెలియని రెండు మృతదేహాలపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తూ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
స్మశానవాటిక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, మే 23 రాత్రి 8 గంటల సమయంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలను స్వర్గపురికి తీసుకొచ్చారు. సాధారణంగా సాయంత్రం 6 గంటల తర్వాత మృతదేహాలకు ప్రవేశం ఉండదని చెబుతున్నప్పటికీ, స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఫోన్‌లో సూచించడంతో ఆ మృతదేహాలను మార్చురీలో ఉంచినట్లు సిబ్బంది వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పేరుతో ఉన్న అధికారిక పత్రాలపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. రెండు గుర్తుతెలియని మృతదేహాలను మే 24న ఖననం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు, మొత్తం వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!