
జనరల్

హైదరాబాద్ నగర ప్రజలకు భారీ శుభవార్త. నాంపల్లి-లక్డీకాపూర్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘వై’ ఆకారంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైందిగా, త్వరలో పరిపాలనా అనుమతులు లభించనున్నాయి. హెచ్‌ఎండీఏ ఈ ప్రాజెక్ట్ రూపకల్పన బాధ్యతలు చేపట్టింది.
ఈ ఫ్లైఓవర్ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ వద్ద ప్రారంభమై పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ వెనుకగా లక్డీకాపూర్ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ వైపు రెండు మార్గాలుగా విడిపోతుంది. మొత్తం 1.45 కిలోమీటర్ల పొడవుతో, మూడు లైన్లతో నిర్మించే ఈ ఫ్లైఓవర్ ద్వారా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యమై ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!