
షోస్

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా.
తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అల్పపీడనం ప్రభావంతో తీర ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!