

యాపిల్ భారత్‌లో తన ప్రీమియం వ్యూహాన్ని కొనసాగిస్తోంది. తాజాగా విడుదల చేసిన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్లలో ధరలను గణనీయంగా పెంచినట్లు తెలుస్తోంది. కంపెనీ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో టాప్ వేరియంట్ ధర భారత్‌లో రూ.4,49,900 వరకు ఉందని సమాచారం. దేశంలో సగటు వ్యక్తి వార్షిక తలసరి ఆదాయం సుమారు రూ.2.33 లక్షలు కాగా.. ఈ ఐఫోన్ ధర దానికి దాదాపు రెట్టింపుగా ఉంది. దీంతో అధిక ధర కలిగిన ఐఫోన్లు దేశంలోని పరిమిత వర్గానికే అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా అధిక ఆదాయం ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని యాపిల్ తన ప్రీమియం ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.
అయితే భారత్‌లో యాపిల్ వ్యూహం కేవలం ఫోన్ ధరతో మాత్రమే ముడిపడి లేదు. ఐఫోన్‌కు దేశంలో ప్రత్యేకమైన ప్రీమియం ఇమేజ్ ఉంది. చాలా మంది వినియోగదారులకు ఇది కేవలం స్మార్ట్‌ఫోన్ కాకుండా స్టేటస్ సింబల్‌గా కూడా మారింది. అందువల్ల ధరలను తగ్గించి సాధారణ మార్కెట్‌లో పోటీ పడటానికి బదులుగా బ్రాండ్ విలువ, ప్రీమియం అనుభూతి, ప్రత్యేకతను కొనసాగించడంపైనే యాపిల్ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, ఇతర ఫైనాన్సింగ్ ఆఫర్ల ద్వారా ఖరీదైన ఐఫోన్లను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ మంది వినియోగదారులకు లభిస్తోంది. దీంతో అధిక ధర ఉన్నప్పటికీ భారత్‌లో యాపిల్ ప్రీమియం మార్కెట్‌లో తన స్థానాన్ని కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!