

సామాన్య ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో స్థాపించబడిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దివంగత నందమూరి తారక రామారావు సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ వైద్య సంస్థ 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా 100 పడకలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో దేశంలోని ప్రముఖ సమగ్ర క్యాన్సర్ చికిత్స మరియు పరిశోధనా కేంద్రంగా గుర్తింపు పొందింది.
ఏటా సుమారు మూడు లక్షల మంది అవుట్‌పేషెంట్లు, 90 వేల మంది ఇన్‌పేషెంట్లకు సేవలందిస్తున్న ఈ ఆస్పత్రి మానవత్వం, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ సంస్థ రజతోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య నిపుణులు, దాతలు, ప్రముఖులు హాజరుకానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!