

విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్లాంట్‌లో భద్రత విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు మూడు నెలల గడువు విధించినట్లు సమాచారం.
2024 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సుమారు 1,500 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఆ తర్వాత దశలవారీగా బలగాల ఉపసంహరణ కొనసాగింది. ప్రస్తుతం సుమారు 350 మంది భద్రతా సిబ్బంది, 120 మంది అగ్నిమాపక భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని కూడా నవంబర్ 17లోగా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
తాజా పరిణామంతో విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతా ఏర్పాట్లపై ఉద్యోగులు, కార్మిక సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణయంతో ప్లాంట్ భద్రతను ఎలా కొనసాగిస్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!