18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Writer: Shivani K 09:33 AM, 18 ఆగస్టు, 2026
మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బోటుతో సముద్రంలోకి వెళ్లి గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటలకు ఓడలరేవు జెట్టి నుంచి చేపల వేటకు బయలుదేరిన బోటుతో ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అనంతరం ఎలాంటి సమాచారం అందలేదు. ఆగస్టు 12 నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ రాకపోవడంతో ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. బోటులో వీఎచ్‌ఎఫ్‌ సెట్‌తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు తెలిపారు.

గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోస్ట్‌గార్డ్‌ నౌకలను అప్రమత్తం చేసి సముద్రంలో గాలింపు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి సమాచారం సేకరిస్తున్నారు. బాధిత కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, గాలింపు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం సూచించారు. కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్ని మార్గాలను వినియోగించి మత్స్యకారుల సురక్షిత ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుమత్స్యకారులుమత్స్యకారుల గల్లంతుకోనసీమఅల్లవరంగాలింపు చర్యలుకోస్ట్ గార్డ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంసముద్ర గాలింపుమత్స్యశాఖ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్ బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?
షోస్

బిగ్ బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు
షోస్

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి
బిజినెస్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం
షోస్

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!
జనరల్

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల
టెక్నాలజీ

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...
టెక్నాలజీ

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి
బిజినెస్

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి