

ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పరిస్థితులు లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలను ఆపలేవని తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని నిరూపించింది. ఆలంగుడి జోన్‌లోని కీరమంగళం ప్రాంతానికి చెందిన ప్రియదర్శిని తండ్రి తమిళరసన్ సాధారణ పశువుల కాపరి. పరిమిత ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నప్పటికీ, తన కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలని ఆయన కలలు కనేవారు. తండ్రి కష్టాలను చూసిన ప్రియదర్శిని చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రియదర్శిని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కీరమంగళం బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఎలాంటి ఖరీదైన కోచింగ్ లేకుండానే కష్టపడి నీట్ పరీక్షకు సిద్ధమై 502 మార్కులు సాధించింది. తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న 7.5 శాతం రిజర్వేషన్ తనకు మెడికల్ సీటు సాధించడంలో సహాయపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రియదర్శిని విజయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!